లాక్‌డౌన్ నిబంధనలు సడలించి స్కూళ్లు తెరవడంతో విద్యార్థులంతా మళ్లీ బడిబాట పట్టారు. ఈ క్రమంలో మంచి మార్కులు సాధించడం కోసం ఓ ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో వెలుగు చూసింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ సెంటర్‌కు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న విద్యార్థుల్లో 91మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో మలప్పురంలో కరోనా కేసులు వెలుగు చూశాయి. స్థానికంగా టీచర్లు, స్టూడెంట్లలో బయటపడిన కరోనా కేసులన్నీ ఓ ప్రైవేటు ట్యూషన్ సెంటర్ నుంచే వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు.
