వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) ప్రభుత్వ రంగ కంపెనీల (పీఎ్‌సయూ) వాటాల విక్రయం (డిజిన్వె్‌స్టమెంట్) ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ), ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటికరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)లో నిర్దేశించుకున్న రూ.2.10 లక్షల కోట్ల డిజిన్వె్‌స్టమెంట్ లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే, కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.19,499 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. దాంతో 2020-21లో ఈ టార్గెట్‌ను ఏకంగా రూ.32,000 కోట్లకు కుదించుకుంటున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021-22 డిజిన్వె్‌స్టమెంట్ లక్ష్యమైన రూ.1.75 లక్షల కోట్లలో రూ.లక్ష కోట్లు పీఎ్‌సబీలు, ఆర్థిక సేవల సంస్థల వాటాల విక్రయం ద్వారా సమకూరవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర పీఎ్‌సయూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరో రూ.75,000 కోట్లు లభించవచ్చని అంచనా వేసింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన మరిన్ని ముఖ్యాంశాలు..
ఇప్పటివరకు ఎంపిక చేసుకున్న వాటితో పాటు మరిన్ని పీఎ్‌సయూల వ్యూహాత్మక డిజిన్వె్‌స్టమెంట్ కోసం నీతీ ఆయోగ్ తదుపరి జాబితాను రూపొందించనుంది.
దివాలా తీసిన లేదా తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీల మూసివేత ప్రక్రియను సకాలంలో ముగించేందుకు సవరించిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
నిరుపయోగ ఆస్తులతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించలేం. ఆయా మంత్రిత్వ శాఖలు, పీఎ్‌సయూలకు చెందిన భూములు తదితర కీలకేతర ఆస్తులను విక్రయించడం జరుగుతుంది. ప్రత్యక్ష విక్రయం లేదా లీజుకివ్వడం జరుగుతుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేస్తాం.
రాష్ట్రాల డిజిన్వె్‌స్టమెంట్లకు ప్రోత్సాహకాలు
రాష్ట్రాలు సైతం తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించే దిశగా ప్రోత్సహించనున్నట్లు కేంద్రం తెలిపింది. స్టేట్ పీఎ్‌సయూల డిజిన్వె్‌స్టమెంట్‌కు ప్రోత్సాహకాలివ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు తగిన కసరత్తు జరపనున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు.
2021-22లో ఎల్‌ఐసీ ఐపీఓ
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ను వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది కూడా. ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూతో పాటు ఐడీబీఐ బ్యాంక్ మరో రెండు పీఎ్‌సబీల ప్రైవేటీకరణ కోసం అవసరమైన చట్ట సవరణలను ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీలో 100 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదే. ఐపీఓ అనంతరం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాక, రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎల్‌ఐసీ అవతరించనుందని అంచనా.
డిజిన్వె్‌స్టమెంట్ పాలసీ ఆవిష్కరణ
బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం డిజిన్వె్‌స్టమెంట్ లేదా వ్యూహాత్మక డిజిన్వె్‌స్టమెంట్ పాలసీని ఆవిష్కరించింది. మొత్తం నాలుగు రంగాలను వ్యూహాత్మక రంగాల విభాగంలో చేర్చుతున్నట్లు తెలిపింది. ఈ వ్యూహాత్మక రంగాల్లో పీఎ్‌సయూల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆ నాలుగు రంగాల్లోని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించడం లేదా మరో పీఎ్‌సయూలో విలీనం చేయడం లేదా అనుబంధ విభాగంగా మార్చడం లేదా మూసివేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యూహాత్మకేతర రంగాల్లోనైతే అన్ని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీల పాత్ర తగ్గించి ప్రైవేట్ రంగానికి కొత్త పెట్టుబడులకు అవకాశం కల్పించడమే ఈ పాలసీ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది వ్యూహాత్మక వాటా విక్రయించనున్న పీఎ్‌సయూలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)
ఎయిర్ ఇండియా
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఐడీబీఐ బ్యాంక్
బీఈఎంఎల్
పవన్ హన్స్
నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
వ్యూహాత్మక రంగాల్లో చేర్చినవి..
అణు శక్తి, అంతరిక్షం, రక్షణ
రవాణా, టెలీకమ్యూనికేషన్స్
విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు