ఫస్ట్ ఇండియన్ స్పేస్ ఫిల్మ్ ‘టిక్ టిక్ టిక్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టెడ్డీ’. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా, ఆధానా జ్ఞ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిం చిన ఈ చిత్రంలో యంగ్ హీరో ఆర్య, సయేషా, మగిళ్ తిరుమేని(తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటించగా, సాక్షి అగర్వాల్, టెడ్డీ, సతీష్, కరుణాకరన్, మసూమ్ శంకర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టెడ్డీబేర్ సహాయంలో ఓ మెడికల్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఈ చిత్రం కథ సాగుతుంది. సినిమా మొత్తం ఆర్య, టెడ్డీబేర్ చుట్టూనే తిరుగుతూవుంటుంది.
