ఢమాల్‌

0
165
Spread the love

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీలూ నష్టాల్లోనే ముగిశాయి. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ షేరు 6.60 శాతం నష్టంతో సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. బీఎ్‌సఈలోని అన్ని రంగ సూచీలూ నేలచూపులు చూశాయి. బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 4.87 శాతం క్షీణించగా.. ఫైనాన్స్‌ సూచీ 4.59 శాతం పతనమైంది. టెలికాం, ఆటో సూచీ లు 3 శాతానికిపైగా నష్టపోయాయి.

రూ.5.3 లక్షల కోట్లు ఆవిరి

వారాంతంలో స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లు నిమిషానికి రూ.1,450 కోట్లు నష్టపోయారు. మొత్తంగా రూ.5.3 లక్షల కోట్ల సంపద కోల్పోవాల్సి వచ్చింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.200.81 లక్షల కోట్లకు పడిపోయింది.

రైల్‌టెల్‌ లిస్టింగ్‌ అదుర్స్‌

ఈ మధ్యనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో షేర్లను లిస్ట్‌ చేసింది. కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.94తో పోలిస్తే రైల్‌టెల్‌ షేరు ధర తొలి రోజే 29.15 శాతం ఎగబాకి రూ.121.4 వద్దకు చేరుకుంది.

కొంతకాలం బేర్‌ పట్టులోనే..

అంతర్జాతీయ, భారత స్టాక్‌ మార్కెట్లు కొంతకాలంపాటు బేర్‌ పట్టులోనే కొనసాగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ము న్ముందు నిఫ్టీ 14,300 స్థాయి వరకు తగ్గే అవకాశముందని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ దీపక్‌ జసానీ అన్నారు. అంతేకాదు, ఇక మార్కెట్‌ వేగంగా పుంజుకునే అవకాశాల్లేవని, రికవరీ నెమ్మదిగా జరగవచ్చన్నారు.

పతనానికి కారణాలు

అమెరికా, భారత బాండ్‌ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరుగుతుండటం.

సిరియాపై అమెరికా వైమానిక దాడులతో మొదలైన ఉద్రిక్తత

శుక్రవారం ఆసియా మార్కెట్‌ సూచీలూ నష్టాల్లో ప్రారంభం కావడం

ముడిచమురు, ఇతర కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతుండటం

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మార కం విలువ భారీగా క్షీణించడం

జీడీపీ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్త వహించడం

దేశీయ ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here