కొండచిలువను తన్ని, చితకబాది,… సెల్ఫీలు… మనుషులేనా వీళ్లు?

0
502
Spread the love

ముంబైలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కదా… ఇలా వానలు పడిన సమయంలో… కొండ చిలువలు… ఎప్పుడూ ఉండే ప్రదేశంలో ఉండలేక… నీరు లేని వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటి ఓ మూగ జీవి… కొందరు కుర్రాళ్ల కంట పడింది. అది ఏ నాగుపామో అయితే… కాటేస్తుందనే భయంతో దాని జోలికి వెళ్లేవాళ్లు కాదేమో. కానీ పాపం అది నెమ్మదిగా వెళ్లే కొండ చిలువ కదా… ఆ కేటుగాళ్లు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు వంచి… కాళ్లతో తన్ని, చేతులతో చితకబాది… అది వాళ్లకు లొంగాక… దానితో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ దుర్మార్గపు ఘటన… బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. బుధవారం రాత్రి సమయంలో ఇది జరిగినట్లు తెలిసింది. ఆ కుర్రాళ్లు ఉంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తూ… అది వాళ్ల కంటపడటమే దాని తప్పిదమైంది.

సెల్ఫీలు తీసుకున్నాక… ఆ 8.5 అడుగుల పామును ఓ సంచిలో కుక్కి… దగ్గర్లోని అడవిలో వదిలేశారు. పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ… ఆ వీడియో ఆధారంగా… అటవీ అధికారులకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే అధికారులు… వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద… వాళ్లపై కేసు రాసి… కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్లను ఇంటరాగేట్ చేసి… చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Posted by Pawan Sharma on Thursday, August 6, 2020


ఈ సందర్భంగా… ముంబై ప్రజలకు అటవీ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా వన్య ప్రాణులు కనిపిస్తే… తమకు కాల్ చెయ్యాలనీ, అంతే తప్ప… వాటి జోలికి వెళ్లొద్దని తెలిపారు. రూల్స్‌కి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా… కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here