మ‌నిషి ఆలోచించేది ఈ అయిదింటి (5) గురించే…. మాస్లో చెప్పిన ‌ముచ్చ‌ట‌! 100 శాతం క‌రెక్ట్!

0
552
Spread the love

“మనిషి అవసరాలు – మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్”: కడుపు కాలిన వాడు మాట్లాడే మాటలకి, కడుపు నిండిన వాడు మాట్లాడే మాటలకి తేడా ఉంటుంది. నాకు తెలిసి ప్రపంచంలోని…..ఏ మ‌నిషినైనా అడ్డంగా కోసినా, నిలువుగా కోసినా కనిపించేది వాడి అవసరాలు, కోరికలు మరియు వాడి గుర్తింపు మాత్రమే!

అబ్రహాం హెరాల్డ్ మాస్లో అనే అమెరికన్ సైకాలజిస్ట్ సమాజాన్ని అధ్యయనం చేసి మనిషి అవసరాలని 5 రకాలుగా విభజించాడు. ఇది మనకి తెలిస్తే ఎవరితో మాట్లాడుతున్నా, వాడు/ఆమె ఆవిధంగానే ఎందుకు మాట్లాడుతున్నారో కొంతవరకు అర్ధమవుతుంది.
మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ ప్రకారం మనిషి అవసరాల పిరమిడ్ లో ఐదు స్టేజ్ లు ఉంటాయి

1.శారీరక అవసరాలు (Physiological Needs): మొదట మనిషికి ఆహారం, నీరు, గాలి, నిద్ర లాంటివి అవసరం.

  1. భద్రత (Safety Needs): ఒకసారి శారీరక అవసరాలు తీరాక భద్రత గురించి ఆలోచిస్తాడు, ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు, ఆర్థిక పరమైన వాటి గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు.
  2. సామాజిక అవసరాలు (Social Needs): శారీరక అవసరాలు, భద్రత వచ్చాక మనిషి సామాజిక అవసరాలైన స్నేహం, కుటుంబం, కమ్యూనిటీ గ్రూప్స్, మతం, సమాజం గురించి ఆలోచన చేస్తాడు.
  3. గౌరవం(Esteem Needs): ఒకసారి పైన పేర్కొన బడిన మూడు వచ్చాక గౌరవం, సంపాదన, వ్యక్తిగత విలువ, సామాజిక విలువ ఇత్యాధి అంశాల గురించి ఆలోచిస్తాడు.ఒకసారి ధనం, సంపాదన వచ్చాక వాటిని కాపాడుకోటానికి రాజకీయం, మిగతా వ్యాపార అభివృద్ది గురించి ఆలోచన ఉంటుంది.

5.స్వీయ వాస్తవికత (Self- Actualization Needs): ఇక్కడ వాడు ఏమి కావాలానుకుంటున్నాడో దాని గురించి…మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని, అధ్యక్షుడు, కంపనీ CEO ఇలా వాడి వ్యక్తిగత అభివృద్ది కోసం ఆలోచన ఉంటుంది, వాడు మిగతా వేటి గురించి ఆలోచన చేయడు, ఇదే పరమావధి.

…సో ఎవరితో మాట్లాడుతున్నా ఈ జీవిత అవసరాల పిరమిడ్ లో అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అనే దాని బట్టి అవతలి వ్యక్తి మాటలు, చేతలు ఉంటాయి.!

ఉదాహరణకి, చదువు అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం కావాలి అంటారు, ఉద్యోగం వచ్చాక మంచి జీతం ఉన్న ఉద్యోగం లేదా ప్రమోషన్, ఆ తర్వాత అందమైన పార్టనర్, కారు మొదలగునవి, ఆ తర్వాత వీడే ఆఫీస్ పాలిటిక్స్ చేసి గ్రూప్స్ కట్టి మరింత ఎదుగుదల, ఆ తర్వాత కంపనీ కే CEO/ ప్రెసిడెంట్ ఇలా ఉంటుంది. రాజకీయం లో అయినా సమాజం లో అయినా, ఇంకెక్కడ అయినా ఇదే తరహా ఉంటుంది.

ఫైనల్ గా అందరి మాటలు, చేతలని ఒకే గాడిన లెక్క కట్టటం కరక్ట్ కాదు, ఆయా వ్యక్తులు జీవిత పిరమిడ్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ అవసరాలు, కోరికల, గుర్తింపు మొదలగు వాటిని బట్టి అవతలి వ్యక్తి మాటలి, చేతలు, ఆలోచనలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here