నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడి అత్యంత హేయం, అమానవీయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కాగా.. గిరిజనులపై దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
