ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి 15,011కోట్లు

0
319
Spread the love

తెలంగాణ ప్రభుత్వానికి 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు.. ఆరేళ్లలో 9 రకాల పన్నులు, రాయల్టీల రూపంలో రూ.15,011 కోట్లు చెల్లించినట్లు సింగరేణి వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి 21 రకాల పన్నులతో రూ.17,692 కోట్లు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తంగా రూ.32,703 కోట్లు చెల్లించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల్లో సింగరేణి కూడా భాగస్వామి అవుతోందని వెల్లడించింది. ఆరేళ్ల సింగరేణి ప్రగతిపై గురువారం నివేదికను విడుదల చేశారు.

పన్నుల రూపేణా ప్రభుత్వాలకు నిధులు సమకూర్చడమేకాకుండా ఆరు జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, సీవరేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటికి జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ (డీఎంఎ్‌ఫటీ) కింద రూ.2,739 కోట్లు, సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యక్రమాల అమలు నిధుల కింద రూ.230 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. సింగరేణి విస్తరించిన 120 గ్రామాలతోపాటు 15 పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వైద్యశిబిరాలు, పర్యావరణహిత కార్యక్రమాలు చేపడుతున్నట్టు గుర్తు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టామని, వచ్చే 5 ఏళ్లలో 14 కొత్త గనులకు అనుమతులు పొందాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 2014లో 50 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించిన సింగరేణి 2019-20నాటికి64 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుందని, 2025-26నాటికి 100 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. హరితహారం కోసం 4.60 కోట్ల మొక్కలు నాటినట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే.. సింగరేణిని, ఆర్టీసీని ప్రభుత్వమే బతికిస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవలచేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆరేళ్ల నివేదికను సింగరేణి విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆరేళ్లలో సింగరేణి సాధించిన ప్రగతి

అమ్మకాల్లో 103 శాతం వృద్ధి ఫ లాభాల్లో 137 శాతం వృద్ధి

బొగ్గు ఉత్పత్తిలో 27ు వృద్ధి.. రవాణాలో 30ు వృద్ధి

ప్రారంభించిన కొత్త గనులు : 8

ఆరేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 13,803

సింగరేణి థర్మల్‌ కేంద్రంతో ఇచ్చిన విద్యుత్‌ 36,126మి.యూ

ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించనున్న గనులు : 2

తొలిదశలో చేపట్టిన సోలార్‌ ప్లాంట్లు 300 మెగావాట్లు

రెండో దశలో 350 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here