
జిల్లాలోని దోమ మండలం బొంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో వెంకటయ్య(37) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని వెంకటయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.