బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ షాకిచ్చింది. ప్రజా ప్రతినిధులపై కేసులను విచారిస్తున్న నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.
2015లో ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్‌ను జరిపి తీరుతామని విద్యార్థులు ప్రకటించగా.. ‘‘అదే జరిగితే.. వర్సిటీ మరో ‘దాద్రి’ అవుతుంది’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఆ రోజు వర్సిటీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన పోలీసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు 295ఏ కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ.. అప్పీల్‌కు నెల రోజులు గడువు ఇచ్చింది.