ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం

0
272
Spread the love

అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ సురభి వాణి దేవి కారుకు ప్రమాదం జరిగింది. ఆమెను డ్రాప్ చేసిన అనంతరం 8వ నంబర్ గేట్ను‌ ఆ కారు ఢీకొంది. భారీ శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సురభి వాణిదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం స్పీకర్‌ను కలవడానికి అసెంబ్లీకి వచ్చారు. ఆమె కారు దిగిన అనంతరం గేట్ నెం 8 దగ్గర పార్కింగ్ స్థలంలో వాహనం అదుపు తప్పి గేట్‌ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో వాణీ దేవి లేకపోవండతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ తీయాల్సిన వాహనం గన్ మెన్ తీశాడని, అతనికి డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడంతో ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here