రాచకొండ సీపీ మహేష్ భగవత్ మల్కాజిగిరి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

అనంతరం ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. మల్కాజిగిరి ప్రైమరీ సెంటర్‌లో మొదటిగా తానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేదని… వైద్య సిబ్బంది అరగంట విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహ వద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు. 15 కేంద్రాల్లో రోజుకు 100 మంది సిబ్బంది వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో వ్యాక్సన్ పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. కచ్చితంగా పోలీసులు వ్యాక్సిన్ తీసుకోవడంలో ముందుంటారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.