కరోనా టీకా వికటించి అంగన్‌వాడీ టీచర్ మృతి చెందింది. అశ్వారావుపేట మండలం, నందిపాడు అంగన్‌వాడీ టీచర్ నాగమణికి గత నెల 21న వ్యాక్సిన్ వేశారు. అయితే టీకా తీసుకున్న మరుసటి రోజు నుంచి జ్వరం, వొళ్లునొప్పులు రావడంతో ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. టీకా వికటించడంవల్లే నాగమణి మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నాగమణితోపాటు అదే రోజు మరో 50 మంది అంగన్ వాడీ టీచర్లకు టీకా వేశారు. వారంతా ఆందోళనలో ఉన్నారు.
