నిజామాబాద్: జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 85 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్ సోకడంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వ క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
