నేడు, రేపు బయట తిరగొద్దు

0
351
Spread the love

 రాష్ట్రంలో ఈనెల 5 నుంచి 7 వరకు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 5 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాడ్పులు వీస్తాయని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్‌ భూపాలపల్లి, ములుగు. భ ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొంది. కాబట్టి ప్రజలు ఆరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా శనివారం భద్రాచలంలో గరిష్ఠంగా 42.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here