‘పర్యాటకం’లో పంతాలు

0
364
Spread the love

సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 14న టీఎ్‌సటీడీసీ చైర్మన్‌గా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాలున్నా.. పర్యాటకులను ఆకర్షించడంలో, ఆదాయాన్ని ఆర్జించటంలో పర్యాటక శాఖ విజయవంతం కావడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ అంశంపై చైర్మన్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా స్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లను అక్కడి అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే వీటిపై చైర్మన్‌ తనకు సమాచారం ఇవ్వడంలేదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అసంతృప్తితో ఉన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీఆర్‌ గతంలోనే పిలుపునిచ్చారు. కేటీఆర్‌ సైతం స్వయంగా దీనిని అమలు చేస్తున్నారు. ఈ విషయంపై చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక శాఖలోని ఉద్యోగులంతా ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనికోసం ఉద్యోగులకు చేనేత వస్ర్తాలను కూడా అందించారు. ఈ నిర్ణయంపైనా మంత్రి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

సీఎంవో దృష్టికి ప్రచారకర్త నియామకం..

చైర్మన్‌, మంత్రి మధ్య ఇప్పటికే పలు అంశాల్లో వివాదం కొనసాగుతుండగా.. తాజాగా ప్రచారకర్తగా దేత్తడి హారికను నియమించడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. సోషల్‌ మీడియాలో యువతను ఆకట్టుకుంటున్న హారికను నియమించాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, గతంలోనే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చైర్మన్‌ చెబుతున్నారు. కానీ, మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాత్రం తనకు సమాచారం లేదని బుధవారం తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి కూడా మంత్రి తీసుకెళ్లినట్టు తెలిసింది. హారిక నియామకం వివాదం అవుతుండటం, ప్రచారకర్తగా త్వరలో మరొకరిని నియమిస్తామని మంత్రి ప్రకటించడంతో హారిక తొలగింపు ఖాయమని తెలుస్తోంది. ఆమెను తొలగించాలని సీఎంవో సైతం పేర్కొన్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here