జిల్లాలోని డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్(55) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా ఈ దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళిన కామాంధుడు బలత్కారానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది. సీసీ కెమెరాలో కామాంధుడు ఇంటి నుంచి బాలిక ఏడుస్తూ బయటికొస్తున్న వీడియో ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
