మిస్‌ ఇండియాగా మానస

0
245
Spread the love

సుస్మితాసేన్‌.. దియా మీర్జా.. డయానా హేడెన్‌.. సింధూర గద్దె.. వాసుకి సుంకవల్లి.. వీరంతా అందాల పోటీల్లో హైదరాబాద్‌ కీర్తి పతాకను అంతర్జాతీయంగా ఎగురేసిన వారే! ఇప్పుడు వారి సరసన మరో తెలుగమ్మాయి నిలిచింది. హైదరాబాద్‌ వనితల అందం, మేధస్సును వేనోళ్ల పొగిడేలా చేసింది. ఆమే మానస వారణాసి! బుధవారం రాత్రి ముంబైలో జరిగిన మిస్‌ ఇండియా పోటీల ఫైనల్స్‌లో మానస(23) విజేతగా నిలిచింది. తొలిసారి వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ పోటీలో మానస.. తన అందం, తెలివితేటలతో న్యాయనిర్ణేతలను మెప్పించింది. ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. మిస్‌ ఇండియా 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న 70వ ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. మానస గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం వాసవి కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ సంస్థలో ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌ ఎనలి్‌స్టగా పనిచేస్తోంది. చిన్నతనంలో మానసకు బిడియం ఎక్కువ.

తనను తాను వ్యక్తీకరించుకోవడానికి కూడా సిగ్గుపడే ఓ అమ్మాయి మిస్‌ ఇండియాగా మారడం వెనుక స్ఫూర్తి కలిగించిన అంశం ఏంటని అడిగితే.. ‘తెలుసుకోవాలన్న ఉత్సుకతే’ అన్నది ఆమె సమాధానం. పుస్తక పఠనం, సంగీతం, నృత్యం, యోగాతో పాటు ప్రకృతిని అధ్యయనం చేయడమంటే ఎనలేని ఇష్టమని చెబుతుంది. సంగీతం, భరతనాట్యంలో మానస సుశిక్షితురాలు. తన జీవితంపై అమ్మ, అమ్మమ్మ, సోదరి ప్రభావం చాలా ఎక్కువని.. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాను చూసి స్ఫూర్తి పొందానని చెబుతోంది. బదిరుల (సైగలు) భాషను నేర్చుకున్నానన్న మానస, తన ఆనందం కోసమే దాన్ని నేర్చుకున్నానని ఇన్‌స్టాలో వెల్లడించింది. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. స్వీయ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదని స్పష్టం చేస్తోంది. ఆ నమ్మకమే ఇప్పుడు ఆమెను మిస్‌ ఇండియా టైటిల్‌తో పాటు మిస్‌ ర్యాంప్‌ వాక్‌ టైటిల్‌నూ గెలుచుకునేలా చేసింది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్య సింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నర్‌పగా నిలిచింది. ఈమె ఓ ఆటోడ్రైవర్‌ కూతురు కావడం విశేషం. కడు పేదరికంలో పెరిగిన తాను జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానని, ఇప్పుడిలా ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో రన్నర్‌పగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని మాన్య వెల్లడించారు. ఇక హరియాణాకు చెందిన మనికా శికంద్‌ ‘మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020’గా నిలిచింది. సినీ నటులు నేహా ధుపియా, చిత్రాంగద సింగ్‌, పుల్కిత్‌ సామ్రాట్‌లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.అ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here