నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండో ప్రాధాన్యత ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా తమకు పడే అవకాశం ఉందని తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం ఏబీఎన్‌తో మల్లన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు తమకు చాలా సంతృప్తినిచ్చాయని తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు కష్టాలు తీర్చే తీన్మార్ మల్లన్న ఎక్కడున్నాడో తెలుసుకుని మరీ దూరంగా ఉన్న తన 39వ నంబర్‌కు ఓటు వేశారన్నారు. తీన్మార్ మల్లన్న సత్యం వైపు డబ్బులు ఖర్చు పెట్టిన పోటీ చేసిన వారు అసత్యం వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏడేళ్ల తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు.

పాదయాత్రలో పట్టభద్రులను కలవలేదని…వారి తల్లిదండ్రులనే కలిశానని, వారి సమస్యలను దగ్గరగా చూసినట్లు తెలిపారు. యుద్ధం ఇంకా మిగిలే ఉందని.. కేవలం10 శాతం మాత్రమే వర్క్ చేశానని ఈ ఎన్నికల్లో తెలిసిందన్నారు. ఇంకా 90 శాతం పని మిగిలే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచే ప్రారంభిస్తామని, అది పూర్తి చేస్తే డిపాజిట్లు కూడా రావని తెలిపారు. అసలైన యుద్ధం ఆ కుర్చీని తీసి పక్కన పెట్టడమే అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. మొదటి ప్రాధాన్యతలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 1,10,840,రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లు, మూడో స్థానంలో కోదండరాంకు 70,072 ఓట్లు వచ్చాయి.