తెలంగాణ పోలీ్‌సకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ స్థాయి టాప్-10 పోలీస్ స్టేషన్‌లలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట స్థానం దక్కించుకుంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు ప్రతి ఒక్కరి పనితీరుతోనే ఈ గుర్తింపు లభించిందని, దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటను తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రపతి జీవన్ రక్షా పతకం సాధించడం సృజన్ రెడ్డి సాధించిన మరో విజయంగా డీజీపీ కొనియాడారు. ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సమక్షంలో సృజన్ రెడ్డిని డీజీపీ అభినందించారు.