తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కన్నీరుపెట్టుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతికకాయానికి కేసీఆర్ నివాళి అర్పించారు

ఈ సందర్భంగా కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

రామలింగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం చెందడంతో సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన ముందుండి పనిచేశారని గుర్తు చేసుకున్నారు.