325స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
191
Spread the love

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే గ్రేటర్‌లో 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని తెలిపారు. చెత్తను తరలించేందుకు ఇన్నాళ్లు ఉన్న డొక్కు వాహనాలకు స్వస్తి పలికామని చెప్పారు. 2500కు అదనంగా 650 కొత్త స్వచ్ఛ ఆటోలు తెస్తున్నామని…అందులో భాగంగా ఈ రోజు 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్‌ను తరలిస్తుందని తెలిపారు. డ్రైవర్ కం ఓనర్ పద్ధతిలో అందచేసిన ఈ స్వచ్ఛ ఆటోలు పది శాతం లబ్ధిదారుడు, 90 శాతం జీహెచ్ఎంసి భరించిందని తెలిపారు. ఇప్పటికి నగరంలో స్వచ్ఛ ఆటోలు కవర్ కానీ ప్రాంతాలలో ఈ ఆటోలు గార్బజ్ సేకరిస్తాయన్నారు. ప్రతిరోజూ ఒక్కో స్వచ్ఛ ఆటో 600 ఇళ్ల నుండి చెత్త సేకరిస్తుందని చెప్పారు. ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండడంతో పాటు ప్రమాదకర వ్యర్థాలకు సపరేట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరోనా మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌లో శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, మేయర్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here