Prathyusha Garimella: ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ గరిమెళ్ల ప్రత్యూష ఆటో బ‌యోగ్ర‌ఫీ ఇదే!

0
540
Spread the love

తను ఇండియాలోని టాప్ 10 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరు..! మన భారతదేశం లోని అగ్ర సినీ పరిశ్రమలయిన బాలీవుడ్, టాలీవుడ్, మరియు కోలీవుడ్ ఇలా, సినీ రంగానికి చెందిన ప్రముఖ సినీతారలందరికి తను ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేశారు. జాక్వలిన్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్, కాజల్ దేవగన్, విద్యా బాలన్, రవీనా తండన్, నేహా దూప్యా, శృతి హాసన్ అంతేకాక క్రీడాకారిణి సానియా మీర్జా,హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, కృతి కర్బంద ఇలా అనేకమంది ప్రముఖ హీరోయిన్స్ కి తను వర్క్ చేశారు.

2013 లో, మొదలైన ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో తను ఏ రోజు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆశ్చర్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ లో సరిగా అనుభవం కూడా లేని తన ప్రయాణం ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న సమయంలో, ఎవ్వరు వూహించని విధంగా, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన “గరిమెళ్ల ప్రత్యూష” జూన్ 11 శనివారం, బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అది అసలు ఆత్మహత్యేనా, లేక హత్యా అనే వియషం గురించి తెలుసుకునే ముందు అసలు ఎవరీ ప్రత్యూష, తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనమిప్పుడు తెలుసుకుందాం.

“1986 మే 3” న ముంబై లో జన్మించారు ప్రత్యూష. వారు తెలుగువారైనప్పటికీ, తన తండ్రికి “LED India ప్రైవేట్ లిమిటెడ్” కు సంబంధించి, ముంబై లో కొన్ని వ్యాపారాలు ఉండటంతో, వారు ముంబయి లో స్థిరపడ్డారు. అంతేకాక ప్రత్యూష గారి తండ్రి కేంద్ర సర్వీసెస్ లో IRS గా సేవలందిచిన ఒక మాజీ
అధికారి. అయితే ప్రత్యుష కొన్నాళ్లపాటు హైదరాబాద్ లో చదివారు. కానీ తన ఉన్నత విద్యను మాత్రం ముంబై లో పూర్తి చేశారు. ముంబై లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రత్యూష, బ్రిటన్ లోని “యూనివర్సిటీ ఆఫ్ వార్విక్” నుండి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం పారిస్ లో కొన్ని రోజులు తన తండ్రి వ్యాపారానికి సంబంధించి, కొన్ని అధ్యయనాలు చేసారు. చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ పై ప్రత్యూషకు ఎంతో ఆసక్తి ఉండేది. కానీ, తన మాస్టర్స్ కంప్లీట్ చేసి, వాళ్ళ కంపెనీ లో వుద్యోగంలో చేరారు. కానీ ప్రత్యూష కొన్నాళ్ల తరువాత వాళ్ళ కంపెనీ వుద్యోగం నుండి బయటకు వస్తూ, తనకు ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉందని చెప్పడంతో తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. అలా ప్రత్యూష ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి, సొంతంగా తన పేరుతోనే లేబుల్ క్రియేట్ చేసి, ఫ్యాషన్ ప్రపంచంలో, అగ్రశ్రేణి డిజైనర్ గా నిలిచారు.

హైదరాబద్ లోని ఒక ప్రత్యేక స్టోర్ తో పాటు, వెబ్సైట్ల ద్వారా కూడా తన స్పెషల్ ఫ్యాషన్ వేర్ విక్రయించేవారు. తన బిజినెస్ స్టార్ట్ చేసిన నాలుగు ఏళ్లలోనే, బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగారు. దక్షిణాది లో వున్న టాప్ హీరోయిన్స్ అందరికి తనే డ్రెస్ డిజైన్ చేసేవారు. అలా మనదేశంలోని పేరు పొందిన 30 మంది ఫ్యాషన్ డిజైనర్స్ లో, టాప్ 10 లో ఒకరిగా ప్రత్యూష తన స్థానాన్ని నిలుపుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రత్యూష గారి వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే తనకు ఇంకా వివాహం కాలేదు. తను హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో నివసించేవారు. అయితే, జూన్ 11 శనివారం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన “గరిమెళ్ల ప్రత్యూష” ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటూ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయ్యింది. వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యూష యొక్క ఇంటికి వెల్లగా, తన ఇంటి డోర్ లోపల నుండి లాక్ చేసి వుంది.

ప్రత్యూష మరణించడానికి ముందు రోజు సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చి, తన ఇంట్లో పనిచేస్తున్న వాచ్ మాన్ యొక్క భార్యకు, ఈ రోజు ఎవరు ఇంటికి రావొద్దు ఏదైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను అని చెప్పి వెళ్లిపోయింది. కానీ, ఆ రోజు రాత్రి 9 గంటల సమయం అయిన, ప్రత్యుష ఇంట్లో లైట్స్ వెలగకపోవడం ను గమనించిన వాచ్ మన్ వెళ్లి ఆ ఇంటి డోర్ కొట్టి చూసారు. అయినా ఆ ఇంటి డోర్ ఓపెన్ కాకపోవడంతో, మేడమ్ పడుకుని ఉన్నారన్న ఆలోచనతో వాచ్మన్ సైలెంట్ గ వెళ్లిపోయారు. ఆ తరువాత, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్లి లేపేందకు ప్రయత్నించగా, అప్పటికి ఎంతకు లోపలినుండి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి, ఇక ఆ ఇంటి వాచ్ మన్ ప్రత్యుష కి కాల్ చేశారు. అయిన లోపలి నుండి ఏ విధమైన సమాధానం రాలేదు. ఆ తరువాత, ఉదయం 9 గంటల సమయంలో ప్రత్యూష యొక్క నాన్నగారు వచ్చి ఎంత కొట్టిన డోర్ ఓపెన్ కాకపోవడంతో, బలవంతగా డోర్ ఓపెన్ చేసి లోపలి వెళ్లి చూడగా, ప్రత్యుష తన వాష్ రూమ్ లో అనుమానుస్పదంగా, విగతజీవిగా పడి వున్నారు.

వెంటనే, బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ కి కాల్ చేశారు ప్రత్యుష గారి తండ్రి, అయితే మరుక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తన మరణం అధ్యయనం వెనుక కీలక విషయాలను వెల్లడించారు. ప్రత్యూష తన మారణానికి 10 రోజుల ముందే, ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాన్ చేశారని, తన మొబైల్ లోని గూగుల్ హిస్టరీ లో, నొప్పి ప్రభావం లేకుండా సింపుల్ గా మరణించడమెలా అనే విషయాన్ని సెర్చ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఇలా కొన్ని రోజులు తన మొబైల్ లో సెర్చ్ చేసిన ప్రత్యుష చివరకు, గాలి లోపలి వ్యాపించని రూమ్ లో, కార్బన్ మోనాక్సైడ్ ను ఉపయోగించి మరణించడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేకాక తన గదిలో పోలీసులు కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను కూడా స్వాధీన పర్చుకున్నారు.ఈ కార్బన్ మోనాక్సైడ్ ద్వారా మరణించడం అనేది, మన ఇండియా లో తక్కువే అయినప్పప్పటికీ, అమెరికా లాంటి విదేశాల్లో ఈరకమైన ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.అంతేకాక, 2022 ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రంలోని ఒక సాఫ్త్వేర్ ఇంజనీర్ ఆర్ధిక సమస్యలలో చిక్కుకుని, తన కుటుంబం మొత్తం మరణించాలని, ఒక ప్రణాళికాబద్ధంగా కాల్షియం కార్బోనేట్ మరియు జింక్ ఆక్సైడ్ రెండిటిని కలిపి, కార్బన్ మోనాక్సైడ్ ను ఉత్పత్తి చేసి ఆ కుటుంబం మొత్తం మరణించడం జరిగింది.

అసలు ఈ కార్బన్ మోనాక్సైడ్ ను మనం పీల్చడం మొదలుపెట్టగానే, వికారం, వాంతులతో అపస్మారక స్థితికి చేరుకునే అవకాశముంది.
ఆ తరువాత నిముషాల వ్యవధిలోనే, గుండె ఆగిపోతూ మనిషి మరణించడం జరుగుతుంది.తను ఆత్మహత్య చేసుకునే కొన్ని రోజుల ముందు, తను చనిపోవాలనుకున్న వాష్ రూమ్ యొక్క గదికి కార్పెంటర్ ను పిలిపించి, వెంటిలేషన్ జరగకుండా, కిటికీ, వెంటిలేటర్ ను మూసివేయించారు.
అంతేకాక, తను చనిపోయేముందు వ్రాసిన సూసైడ్ నోట్ నే కాక, తన పెన్డ్రైవ్ లో మరొక సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే బయట వున్న సూసైడ్ నోట్ లో, “నేను నా తల్లితండ్రులకు భారం కాలేనని, అంతేకాక ఒంటరి జీవితంతో తను విరక్తి చెందానని” ఆ సూసైడ్ నోట్ వ్రాసి ఉంది.అయితే, ఇవే కాక ప్రత్యూష ఇంకేదైనా కారణాలవలన మరణించారా, లేక ప్రణాళిక ప్రకారం చేసిన హత్య నా అనే విషయం తెసుకునేందుకు పాలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ మరణాన్ని ఐపీసీ 174 సెక్షన్ కింద నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే మరీ ముఖ్యంగా, ఈ ప్రత్యుష మరణం వెనుక ఆసక్తికరంగా మారిన విషయం. తనకు ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు లేవు, అలానే కోట్ల ఆస్తి కలిగిన తను, ఎట్టి పరిస్థితులలో తన తల్లితండ్రులకు భారం కాదంటూ, తను కొన్నేళ్లుగా ఒక వ్యక్తిని ఘాడంగా ప్రేమిస్తుందంటూ, మరియు వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగానే, తను ఈ బలవన్మరణానికి పాల్పడిందంటూ వార్తలొస్తున్నాయి.ఏది ఏమైనప్పటికి, ఎంతో అద్భుతమైన భవిష్యత్తు కలిగి, మన తెలుగు రాష్రాలకే గర్వించదగ్గ వ్యక్తిగా పేరొందిన “గరిమెళ్ల ప్రత్యూష” టాలీవుడ్ మరియు బాలీవుడ్ కు తీరని లోటు ను మిగులుస్తూ తన తుది శ్వాస విడిచారు. ఈ విషయంపై స్పందించిన టాలీవుడ్ మరియు బాలీవుడ్ తారలు ఆమె మరణంపై, తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, తను లేని లోటును మరెవ్వరు పూరించలేరని వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here