తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి

0
167
Spread the love

 ఏడాది విరామం తర్వాత తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన భారత మహిళల జట్టుకు ఓటమి పలకరించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్లతో ఓడింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్‌) కెరీర్‌లో 54వ అర్ధ సెంచరీ సాధించగా… తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతోన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 178 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లె లీ (83 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌), లారా వోల్వార్డ్‌ (80; 12 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

South Africa Women beat India by eight wickets to win first ODI - Sakshi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here