త్వరలో కాంగ్రెస్‌ మాయం: అమిత్‌ షా

0
152
Spread the love

దేశం నుంచి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ మాయమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్‌లో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం నారాయణస్వామి తీరు నచ్చక తమ పదవులకు రాజీనామా చేయడంతోనే మెజారిటీ లేక పతనమైందని చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం రూ.15 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆ నిధులను మునుపటి ప్రభుత్వం గాంధీ కుటుంబానికి మళ్లించిందని వ్యాఖ్యానించారు. కొద్ది రోజులకు ముందు రాహుల్‌గాంధీ.. జాలర్ల సంక్షేమం కోసం కేంద్రంలో మత్స్యమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని ఆరోపించారని, వాస్తవానికి రెండేళ్లుగా కేంద్రంలో మత్స్య శాఖ పనిచేస్తోందని, ఆ విషయం కూడా తెలియని ఆ నాయకుడికి మద్దతు ఇస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. బీజేపీ కూటమికి ఓటేస్తే పుదుచ్చేరిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని అన్నారు. అలాగే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here