విజేత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. ప్రస్తుతం సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రోజు కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా థీమ్ ఆఫ్ కిన్నెరసాని వీడియో విడుదల చేశారు. ఇందులో కాలుతున్న పేపర్ ఎగురుకుంటూ వచ్చి రోడ్ మీద పడటం.. అదే సమయంలో వర్షం పడటం.. చివరలో కళ్యాణ్ దేవ్ ఫొటో చూపించడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.

‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు .