దుబాయ్: చెన్నై టెస్టులో దారుణ ఓటమి టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన తాజా పరాజయంతో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక, ఈ విజయంతో ఇంగ్లండ్ ఏకంగా టాప్‌లోకి దూసుకెళ్లింది. టెస్టు చాంపియన్‌షి్‌పలో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. ఇప్పటిదాకా 11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో కలిపి మొత్తం 70.2 శాతం పాయింట్లతో నెంబర్‌వన్‌లో నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్‌లాగే ఆరో సిరీస్ ఆడుతున్న భారత్.. 9 విజయాలు, 4 ఓటములు, ఓ డ్రాతో మొత్తంగా 68.3 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్ (70.0), ఆస్ట్రేలియా ఉన్నాయి. కాగా, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడంతో ఇప్పటికే తమ ఖాతాలోని అన్ని సిరీ్‌సలు ఆడేసిన కివీస్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.

భారత్ ఫైనల్ చేరాలంటే…
కోహ్లీసేనకు ఇంకా ఫైనల్ చేరే అవకాశముంది. తాజా నాలుగు టెస్టుల సిరీ్‌సలో ఇంగ్లండ్ మరో మ్యాచ్ గెలవకుండా అడ్డుకోవాలి. దీంతో పాటు టీమిండియా సిరీ్‌సను 2-1 లేదా 3-1తో గెలవాలి. అప్పుడే భారత్ ఫైనల్ చేరుతుంది. ఇక, ఇంగ్లండ్ మూడు టెస్టులు గెలిస్తే ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లు కాకుండా తక్కువ ఆధిక్యంతో సిరీస్ గెలిచినా, సిరీస్ డ్రాగా ముగిసినా.. ఆస్ట్రేలియాకు ఫైనల్ బెర్త్ ఖాయం కానుంది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 578
భారత్ తొలి ఇన్నింగ్స్: 337
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 178
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బి) లీచ్ 12; గిల్ (బి) అండర్సన్ 50; పుజార (సి) స్టోక్స్ (బి) లీచ్ 15; కోహ్లీ (బి) స్టోక్స్ 72; రహానె (బి) అండర్సన్ 0; పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 11; సుందర్ (సి) బట్లర్ (బి) బెస్ 0; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 9; నదీమ్ (సి) బర్న్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (నాటౌట్) 5; బుమ్రా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 4; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 58.1 ఓవర్లలో 192 ఆలౌట్. వికెట్ల పతనం: 1-25, 2-58, 3-92, 4-92, 5-110, 6-117, 7-171, 8-179, 9-179, 10-192. బౌలింగ్: ఆర్చర్ 9.1-4-23-1; లీచ్ 26-4-76-4; అండర్సన్ 11-4-17-3; బెస్ 8-0-50-1; స్టోక్స్ 4-1-13-1.