ఆత్మకూరు మండలం, మహిమలూరు గ్రామంలో తోట వెంకట నర్సయ్య(49) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న నర్సయ్య తలపై బండరాయితో మోదీ హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
