భారత్-ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు మార్గం సుగమమైంది. ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉన్న వీరంతా కరోనా టెస్టుల్లో నెగెటివ్‌గా తేలారు.

దీంతో ఈనెల 5 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం మంగళవారం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు. ‘భారత జట్టు క్వారంటైన్ ముగిసింది. ఈ సమయంలో వారికి మూడుసార్లు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు జరిపితే అన్నింట్లో నెగెటివ్‌గా వచ్చింది. దీంతో సోమవారం సాయంత్రమే ఆటగాళ్లు తొలిసారిగా అవుట్ డోర్ సెషన్‌కు వెళ్లారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేస్తారు’ అని బీసీసీఐ ప్రకటించింది. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఇంగ్లండ్ జట్టు నెట్స్‌లో పాల్గొంటుంది.
ఇంగ్లండ్ ఒక్క మ్యాచూ గెలవదు: గంభీర్
భారత్‌తో 4 టెస్టుల సిరీ్‌సలో ఇంగ్లండ్‌కు ఒక్క మ్యాచ్ కూడా గెలిచే పరిస్థితి లేదని గంభీర్ అన్నాడు. వారి స్పిన్ విభాగం బలహీనంగా ఉందన్నాడు. అలాగే కోహ్లీ వన్డే, టెస్టు కెప్టెన్సీ సామర్థ్యంపై తానెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, టీ20 ఫార్మాట్‌పైనే తనకు అపనమ్మకం ఉందన్నాడు.