నేటి నుంచి లాసెట్‌ దరఖాస్తులు ప్రారంభం

0
279
Spread the love
నేటి నుంచి లాసెట్‌ దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్యలో ప్రవేశాలు కల్పించడం కోసం నిర్వహించే లాసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రవేశపరీక్ష ద్వారా మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో (బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ) ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా రెండేండ్ల పీజీ లా కోర్సుల్లో (ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీలు ఉన్నాయి.
అర్హతలు: ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు.. 45 శాతం మార్కులతో ఇంటర్‌ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మూడేండ్ల లా కోర్సులకు.. 45 శాతం మార్కులతో డీగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: లాసెట్‌.. రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500
పీజీలాసెట్‌.. రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.800
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 24
దరఖాస్తులకు చివరితేదీ: మే 26
రాతపరీక్ష: ఆగస్టు 23
వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here