పంచాయతీ పుట్టింది ఇలా..

0
165
Spread the love

దేశంలో ఆంగ్లేయుల పాలనలో గవర్నర్‌ జనరల్‌గా కారన్‌ వాలిస్‌ ఉన్నప్పుడు లాటరీ విధానంలో పంచాయతీ వ్యవస్థను రద్దు చేశారు. 1884లో లార్డ్‌ రిప్పన్‌ రాజప్రతినిధిగా వచ్చిన తరువాత రద్దు చేసిన పంచాయతీ వ్యవస్థను నూతన హంగులతో పునరుద్ధరించారు. అప్పటి నుంచి బ్యాలెట్‌ ఎన్నికల విధానానికి శ్రీకారం చుట్టారు. అందుకే లార్డ్‌ రిప్పన్‌ను స్థానిక సంస్థల పితామహుడిగా అభివర్ణిస్తారు. పంచాయతీ చట్టం –1964లో అమలులోకి వచ్చింది.అంతకు ముందు మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం –1950 (ఆంధ్రాప్రాంతంలో), హైదరాబాద్‌ గ్రామ పంచాయతీ చట్టం –1956 (తెలంగాణ ప్రాంతంలో) అమలులో ఉండేది. 1959లో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను వేర్వేరుగా ఉన్న పంచాయతీ చట్టాలను రద్దు చేసి రెండింటిని క్రోడీకరించి 1964లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ చట్టాన్ని చేశారు. 1964లో రాష్ట్రం అంతటా ఎన్నికలు నిర్వహించారు. గ్రామాల్లో సాధారణ సమస్యల పరిష్కారానికి ‘పంచాస్‌’ అనే అయిదు గురు సభ్యులతో కూడిన మండలి ఉండేది. పంచాస్‌ అనే పదమే ఆ తర్వాత పంచాయతీగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here