పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజగా ఫస్ట్ గ్లింస్ రిలీజైయింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన కొద్ది సేపట్లోనే మిలియన్స్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క పాన్ ఇండియన్ సినిమా కూడా చేయలేదన్న సంగతి తెలిసిందే. అయినా కూడా పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ రేంజ్‌లో క్రేజ్ ఉండటం గొప్ప విశేషం. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు తెలుగుతో పాటు తమిళం, మళయాళ, హిందీ భాషలలో భారీ పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతోంది. 17వ శతాబ్దం నాటి కాలాన్ని తలపించేలా ఇప్పటికే పలురకాల భారీ సెట్స్ కూడా నిర్మించారు.

ప్రముఖ నిర్మాత ఏ.ఏం రత్నం గతంలో పవన్ కళ్యాణ్‌తో ఖుషీ, కొమరం పులి సినిమాలను నిర్మించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో నిర్మిస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో ఇప్పటి వరకు ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ అండ్ నార్త్ సినీ ఇండస్ట్రీలలో ఉన్న రికార్డ్స్ మొత్తం బద్దలయ్యేలా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా నిర్మిస్తున్నారు. ఒక్క ఫస్ట్ గ్లింప్స్‌తోనే పవర్ స్టార్ హరిహర వీరమల్లుతో చరిత్ర సృష్ఠించబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇకపై పవన్ కళ్యాణ్ టార్గెట్ పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక కొందరైతే ఇటు టాలీవుడ్‌లో ప్రభాస్ మార్కెట్‌ని అటు బాలీవుడ్ స్టార్స్ మార్కెట్‌ని పవర్ స్టార్ గట్టిగానే టార్గెట్ చెసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకంగా ఇమేజ్ కోసం ఏ ఒక్కరిని టార్గెట్ చేయడన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే పవర్ స్టార్ ట్రెండ్ ఫాలో కాడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.