నగరంలో పోలీసుల గెటప్‌తో దుండగులు ఓ వ్యాపారికి బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి తిమ్మిరెడ్డి దిలీప్ కెపిహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ డ్రెస్ లో తుపాకులతో వచ్చిన నిందితుడు కార్తికేయ కిడ్నాప్ చేశాడు. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే దిలిప్ దగ్గర నుండి బెదిరించి డబ్బు వసూలు చేశాడు. నిందితులు కార్తికేయ రఘువర్మ, దీపక్ కుమార్ బోరా, గడ్డం అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. A2 దీపక్ కుమార్ ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకపోవడంతో మోసాలలకు పాల్పడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆర్మీ డ్రెస్‌తో ఊర్లలో మోసాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
