యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన డార్లింగ్.. టైటిల్ లోగోతో కూడిన ‘ఆదిపురుష్’ ఆరంభ్ అనే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఇక తమ హీరో సినిమా నుంచి అప్‌డేట్ అందించి సర్‌ప్రైజ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు.