ప్రీక్వార్టర్స్‌లో ఒసాక

0
188
Spread the love

మెల్‌బోర్న్‌: ప్రపంచ నెంబర్‌ వన్‌ జొకోవిచ్‌, మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లో ఐదు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన టేలర్‌ ఫ్రిట్జ్‌తో శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు నెగ్గిన నొవాక్‌కు అనంతరం ఎడమ కాలికి గాయమైంది. దాంతో చికిత్స తీసుకొని మ్యాచ్‌ కొనసాగించిన జొకో అసమానంగా పోరాడి 7-6 (1), 6-4, 3-6, 4-6, 6-2తో గెలిచి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. అందుకేనేమో ఈ విజయాన్ని తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైనదిగా జొకో అభివర్ణించాడు. అయితే టోర్నీలో కొనసాగడంపై జొకోవిచ్‌ అనుమానం వ్యక్తంజేశాడు. అతడు నాలుగో రౌండ్‌లో రౌనిక్‌తో తలపడాల్సి ఉంది.

మరో మూడోరౌండ్‌ పోరులో థీమ్‌ 4-6, 4-6, 6-3, 6-4, 6-4తో కిర్గియోస్‌పై అద్భుత విజయం సాధించాడు. 8వ సీడ్‌ ష్వార్జ్‌మన్‌, 11వ సీడ్‌ షపోవలోవ్‌ మూడో రౌండ్‌లో కంగుతిన్నారు. ఆరో సీడ్‌ జ్వరేవ్‌, 14వ సీడ్‌ రౌనిక్‌, 18వ సీడ్‌ డిమిత్రోవ్‌ మూడో రౌండ్‌లో నెగ్గారు. మహిళల్లో రెండోసీడ్‌ హలెప్‌ 6-1, 6-3తో కుదెర్‌మొతోవాపై, మూడోసీడ్‌ ఒసాక 6-3, 6-2తో జాబెర్‌పై, 10వ సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 7-6(7-5), 6-2తో పొటపోవాపై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here