బాలయ్యకు అదైతేనే కరెక్ట్‌..

0
181
Spread the love

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎమోషనల్ డ్రామాతో కూడిన యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయి ల్యాండ్ మార్క్‌లుగా నిలిచిపోయాయి. సెంటిమెంట్ నుంచి పెల్లుబికిన ఎమోషన్ అంటే.. బాలకృష్ణ పేరు మాత్రమే గుర్తొస్తుంది. దానికి యాక్షన్ పార్ట్ కలిస్తే ఇంక ఆ సినిమా సక్సెస్‌ని ఎవ్వరూ ఆపలేరు. గతంలో ఎన్నో సార్లు ఈ నిజం నిక్కచ్చిగా నిరూపితమైంది. ముఖ్యంగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయంటే దానికి ముఖ్యకారణం ఒక్క యాక్షనే కాదు, ఒక్క సెంటిమెంటే కాదు, ఒక్క ఎమోషనే కాదు. అన్నీ పర్ఫెక్ట్ సింక్‌లో కంబైన్ అయ్యాయి కాబట్టే ఆ సినిమాలు అంత పెద్ద హిట్స్ అయ్యాయి.

మరి మళ్ళీ బి. గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఎన్ని ట్రెండ్స్ మారిపోయినా, స్టోరీలో సేమ్ ఈక్వేషన్ ఉంటే మాత్రం మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం అన్నది నందమూరి అభిమానుల అభిప్రాయం. ప్రముఖ రచయత బుర్రా సాయి మాధవ్ ఈ అభిప్రాయంతోనే ఏకీభవించారు. ప్రస్తుతం బి. గోపాల్ దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా రాబోతున్న తాజా చిత్రానికి బుర్రా సాయిమాధవ్ కథని అందించే పనిలో ఉన్నారు. సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. బాలకృష్ణ అంటేనే సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్ అని, ఈ మూడింటిని సరిసమానంగా గనక బ్యాలెన్స్ చెయ్యగలిగితే ఆయన అభిమానులే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారని అన్నారు. తను చెయ్యబోతున్న కథ కూడా అదే విధంగా ఉంటుందని సాయి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here