బాలికను 16 ఏళ్లకే తల్లిని చేసిన వివాహితుడు.. పెళ్లికి ఒప్పుకోవడంతో బెయిల్

0
244
Spread the love

ఓ బాలికను రేప్‌ చేసి, ఆమెను 16 ఏళ్లకే తల్లిని చేసిన నిందితుడికి ముంబైలోని పోక్సో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటికే వివాహితుడైన నిందితుడు ఆ బాలికకు 18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసుకుంటాననడంతో.. కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత బాలిక తండ్రికి పరిచయస్తుడైన నిందిత యువకుడు(25).. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. అప్పటికే తనకు వివాహమైనా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ బాలికతో సంబంధం నెరిపాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు రేప్‌ కేసు పెట్టారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. రిమాండ్‌లో ఉన్న ఆ యువకుడు గతంలో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో.. మరోమారు పోక్సో కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ సందర్భంగా.. తాను ఆ బాలికకు 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకుంటానని జడ్జికి చెప్పాడు. నిందితుడి మతం బహు భార్యాత్వానికి అంగీకరిస్తుందని అతడి తరఫు న్యాయవాది వాదించారు. అతడినే పెళ్లి చేసుకోవాలని తన కుమార్తె కూడా అనుకుంటోందంటూ బాధితురాలి తల్లి అఫిడవిట్‌ సమర్పించింది. అయితే అతడికి బెయిల్‌ మంజూరు చేయవద్దని పోలీసులు వాదించారు. వాదోపవాదాలు విన్న కోర్టు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here