అక్కినేని నాగార్జున తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 హోస్టింగ్‌కి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రసారం కానున్న బిగ్‌బాస్ షోకు సంబంధించిన యాడ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో నాగార్జున పాల్గొంటున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఈ యాడ్‌ను షూట్ చేశారు
త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది. బిగ్‌బాస్ సీజన్3కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే నాలుగో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన విధి విధానాలను పాటిస్తూ బిగ్‌బాస్ షోను నిర్వహించనున్నారు.