ఎస్‌బీఐ : యోనో బంపర్‌ ఆఫర్లు

0
216
Spread the love

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

SBI exclusive 4 days shopping festival  

‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో స్పెషల్‌ షాపింగ్ కార్నివాల్‌ను‌ ప్రకటించింది. తన బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్‌ ప్లాట్‌ఫాం యోనో యాప్‌ ద్వారా షాపింగ్‌ చేసిన కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్, క్యాష్‌ బ్యాక్‌ అందించనుంది. ఇందుకోసం అమెజాన్, ఓయో, పెప్పర్‌ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ఎస్‌బీఐ ప్రకటించింది.యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకం ఫిబ్రవరి 4న ప్రారంభమై ఫిబ్రవరి 7వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌తో ఆన్‌లైన్ షాపింగ్, ఇతర ప్రముఖ విభాగాలలో యోనో సూపర్ సేవింగ్ డేస్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓయో హోటల్ బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు, యాత్రా.కామ్‌ ద్వారా ఫ్లైట్ బుకింగ్‌పై 10శాతం తగ్గింపు, శాంసంగ్ మొబైల్స్, టాబ్లెట్‌లు గడియారాలపై 15శాతం తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు పెప్పర్‌ఫ్రై ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7 శాతం మినహాయింపు లభించనుంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులపై షాపింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్ లభ్యం. ఈ కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత సంతోషాన్ని అందించేందుకు యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్‌ శెట్టి తెలిపారు. బ్యాంకింగ్‌, జీవనశైలి అవసరాల దృష్ట్యా అదనపు షాపింగ్ అవసరాలను తీర్చే క్రమంలో మెగా షాపింగ్ ఈవెంట్‌ ఒక ప్రత్యేక అడుగు అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here