బిట్‌కాయిన్ దారుణ పతనం… మార్చి నుండి ఇదే అధ్వాన్నం…

0
203
Spread the love

బిట్ కాయిన్ కిందటి వారం భారీగా పతనమైంది. ఓ సమయంలో 58 వేల డాలర్లు దాటిన ఈ క్రిప్టో… గత వారం 44,239 డాలర్లకు పడిపోయింది. వారంలో ఇది ఏకంగా 21 శాతం పడిపోయింది. గతేడాది మార్చి రెండో వారం తర్వాత బిట్ కాయిన్‌కు ఇది అత్యంత దారుణ పతనం. అప్పుడు క్రిప్టో విలువ 33 శాతం మేర క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 న బిట్ కాయిన్ విలువ 44,716 డాలర్లుగా ఉంది. దీనికంటే కనిష్టానికి పడిపోయింది. గతవారం దాదాపు ప్రతీ సెషన్‌లో విలువ పడిపోయింది.

సోమవారం నుంచి బిట్ కాయిన్ దారుణంగా పతనమైంది. మంగళవారం 45,393 డాలర్లు కాగా, గురువారం నాటికి 51,600 డాలర్లకు పెరిగినప్పటికీ, అంతలోనే 44,647 డాలర్లకు పడిపోయింది. శనివారం 48,330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రధానంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల ప్రభావం బిట్ కాయిన్ పై ప్రతిఫలించింది. కోయిన్ డెస్క్ ప్రకారం పదేళ్ల అమెరికా ట్రెజరీ యీల్డ్స్ గురువారం నాటికి 1.61 శాతం పెరిగాయి. బిట్‌కాయిన్, బంగారంపై అమెరికా భారీ ఆర్థిక ప్యాకేజీ స్టాక్స్ ప్రభావం చూపాయి.

బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ…

బిట్ కాయిన్ మార్కెట్ విలువ అంతకుముందు వారం ట్రిలియన్ డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఇప్పుడిది 1.04 ట్రిలియన్ డాలర్ల నుండి 833 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్‌కు హఠాత్తుగా డిమాండ్ పెరిగిందని, అదే స్థాయిలో గతవారం కుప్పకూలిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్ ధరలు గత వారం కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయని గుర్తు చేస్తున్నారు.

రెండేళ్లలో 15 రెట్లు జంప్…

కిందటి సంవత్సరం ఫిబ్రవరి 19 న బిట్ కాయిన్ విలువ 3,865 డాలర్లు కాగా, గత సోమవారం నాటికి ఏకంగా 15 రెట్లకు పైగా పెరిగి 52 వేల డాలర్లు దాటింది. ఈ ఏడాది జనవరి రెండో వారంలో ఇది 40 వేల డాలర్లను దాటింది. జనవరి మూడో వారంలో 30 వేల డాలర్లకు పడిపోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం 8,612 క్రిప్టోకరెన్సీ సర్క్యులేషన్‌లో ఉంది. వీటి మార్కెట్ క్యాప్ 1.34 ట్రిలియన్ డాలర్లు. ఇందులో బిట్ కాయిన్ వాటా 61.6 శాతముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here