ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నపేరు కరోనా. దీని బారినపడకుండా ఉండేందుకు మనం విశ్వప్రయత్నాలు చేస్తున్నాం. అయితే, ఫిలిప్స్ కంపెనీ తాజాగా భారతదేశ మార్కెట్లో ఓ క్రిమిసంహారక (డిసిన్‌ఫెక్షన్) పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూవీ సీ సిస్టం-3 అనే పేరుతో తీసుకొచ్చిన ఈ పరికరంలో అతినీలాలోహిత సీ కాంతిని (అల్ట్రావైలెట్ సీ)ని ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని ఇంట్లో అమర్చుకుంటే వివిధ వస్తువుల ఉపరితలంతోపాటు గాల్లో ఉన్న కరోనా వైరస్ కారకాన్ని నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ అల్ట్రావైలెట్ సీ కాంతికి సార్స్ కొవిడ్ -2 వైరస్ (కొవిడ్-19 వైరస్‌కు కారణమయ్యేది)ను నాశనం చేయగల శక్తి ఉందని బోస్టన్ వర్సిటీ పరిశోధకులు కూడా తేల్చారు.
బోస్టన్ విశ్వవిద్యాలయంలోని నేషనల్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లాబొరేటరీస్(ఎన్‌ఈఐడీఎల్) అధ్యయనం ప్రకారం, యూవీ సీ కాంతి వనరులు వివిధ వస్తువుల ఉపరితలంపై ఉన్న సార్స్ కొవిడ్ -2 వైరస్‌ను 99% తగ్గిస్తుంది. ఈ యూవీ సీ కాంతినే పిలిఫ్స్ తన పరికరంలో ఉపయోగించింది. దీన్ని మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. పది లీటర్ల సామర్థ్యంగల పరికరం ధర రూ. రూ .7,990, 15 లీటర్లది రూ. 9,990, 30-లీటర్ల కెపాసిటీ వేరియంట్ ధర రూ. 11,990గా నిర్ణయించింది. ఇవి అమెజాన్. ఇన్‌తో సహా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తాయి.