బీఎస్‌4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్

0
598
Spread the love

బీఎస్‌4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌ పడింది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత జరిగిన వాహన విక్రయాల అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే .. గత ఆదేశాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌4 ఇంధన ప్రమాణాలతో తయారైన వాహన విక్రయాలు నిల్చిపోవాలి. బీఎస్‌6 వాహన విక్రయాలు మాత్రమే జరగాలి.లాక్‌డౌన్‌ వల్ల బీఎస్‌4 వాహన విక్రయాల విషయంలో కాస్త సడలింపు దక్కింది. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక 10 రోజుల పాటు వీటిని అమ్ముకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ మార్చి 25 తర్వాత లాక్‌డౌన్‌ అమలు కాలంలో కూడా భారీ స్థాయిలో బీఎస్‌4 వాహనాల విక్రయాలు జరగడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here