కరోనా సంక్షోభంతో గత ఏడాది స్థిరాస్తి రంగం కుదేలైనప్పటికీ, ఈ రంగానికి చెందిన బడా కంపెనీల ప్రమోటర్ల సంపద మాత్రం దూసుకుపోయిందని హురున్ వెల్లడించింది. మ్యాక్రోటెక్ (గతంలో లోధా) అధిపతి మంగళ్ ప్రభాత్ లోధా వరుసగా నాలుగో సారి అత్యంత సంపన్న రియల్టర్‌గా నిలిచారు. ఆస్తి రూ.44,270 కోట్లకు చేరుకుంది. డీఎల్‌ఎఫ్ అధిపతి రాజీవ్ సింగ్ రూ.36,430 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. కే రహేజా కార్ప్‌కు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబం రూ.26,260 కోట్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నుంచి ఐదుగురికి స్థానం దక్కింది.
