రూ.11.57 లక్షల కోట్లు ఫట్‌

0
189
Spread the love

దేశీయ స్టాక్‌ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ అమ్మకాలు పోటెత్తాయి. ప్రీ-బడ్జెట్‌ ఎకనామిక్‌ సర్వే నివేదిక అంశాలు కూడా శుక్రవారం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మార్చలేకపోయాయి. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైన ఈక్విటీ సూచీలు.. మఽధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ ఊపందుకోవడంతో భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 588.59 పాయింట్లు కోల్పోయి 46,285.77 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 182.95 పాయింట్ల నష్టంతో 13,634.60 వద్ద ముగిసింది. గడిచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 3,506.35 పాయింట్లు (7.04 శాతం), నిఫ్టీ 1,010.10 పాయింట్లు (6.89 శాతం) పతనమయ్యాయి. ఈ ఆరు రోజుల్లో బీఎస్‌ఈ మార్కెట్‌ సంపద రూ.11,57,928.54 కోట్లు పతనమై రూ.1,86,12,644.03 కోట్లకు పడిపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ టాప్‌ లూజర్‌: సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 26 నష్టపోగా.. నాలుగు మాత్రమే లాభపడ్డాయి. 5.69 శాతం క్షీణించిన డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు టాప్‌ లూజర్‌గా నిలిచింది. మారుతి 4.99 శాతం పతనమైంది. ఎయిర్‌టెల్‌, బజాజ్‌ఆటో 3 శాతానికి పైగా నష్టపోయాయి.

ఐఆర్‌ఎ్‌ఫసీ లిస్టింగ్‌.. ప్చ్‌!

ఈ మధ్యనే ఐపీఓకు వచ్చిన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌ఫసీ).. శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లను లిస్ట్‌ చేసింది. కంపెనీకి మార్కెట్‌ వర్గాల నుంచి ప్రతికూల స్పందన లభించింది. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.26తో పోలిస్తే బీఎ్‌సఈలో తొలిరోజే 4.42 శాతం నష్టపోయి రూ.24.85 వద్ద స్థిరపడింది.

బ్రూక్‌ఫీల్డ్‌ రూ.3,800 కోట్ల ఐపీఓ

అంతర్జాతీయ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌.. భారత్‌లోని రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) కోసం పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ను ప్రకటించింది. తద్వారా రూ.3,800 కోట్ల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ రీట్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కమర్షియల్‌ ప్రాపర్టీల్లో 1.4 కోట్ల చదరపు అడుగుల వాటాను పబ్లిక్‌ ఇష్యూలో ఆఫర్‌ చేస్తోంది. ఈ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చే నెల 3న ప్రారంభమై 5న ముగియనుంది.

ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు కంపెనీ రీట్స్‌లో కనీసం 200 యూనిట్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిడ్లను 200 యూనిట్ల చొప్పున పెంచుకుంటూ పోవచ్చు. రీట్‌ యూనిట్‌ ధరను రూ.274.275గా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here