న్యూఢిల్లీ: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ‘గెలాక్సీ ఎం02’ పేరుతో భారత్ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 6,999 మాత్రమే.

గతేడాది జూన్‌లో లాంచ్ చేసిన ‘గెలాక్సీ ఎం01’కు ఇది సక్సెసర్. వెనకవైపు రెండు కెమెరాలు, మీడియా టెక్ ఎస్ఓసీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వంటివి ఉన్నాయి. పోకో సీ3, రెడ్‌మి 9, రియల్‌మి సి15, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బి వంటి ఫోన్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం02 2జీబీ ర్యామ్+32 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 6,999 కాగా, 3జీబీ+32జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 7,499 మాత్రమే. బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ నెల 9 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి పరిమిత కాలంపాటు రూ. 200 తగ్గింపు లభిస్తుంది.
శాసంగ్ గెలాక్సీ ఎం02 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ 36739 ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.