వరుసగా నష్టాలనే నమోదు చేస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) లాభాల బాట పట్టాయి. 48969 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం పది గంటల సమయానికి 426 పాయింట్లు లాభపడింది. ఇక, 14464 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం పది గంటల సమయానికి 135 పాయింట్లు ఎగబాకింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో లాభాల్లో పయనిస్తుండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
