వాట్సాప్ చాట్స్ టెలిగ్రాంలోకి

0
217
Spread the love

వాట్సాప్ కొత్త ప్రైవసీ నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ ని డిలీట్ చేసి ఇతర మెసేజింగ్ యాప్‌లను వాడటం మొదలుపెట్టారు. అన్నిటికంటే ఎక్కువగా టెలిగ్రామ్, సిగ్నల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నారు. ఇలా ఇతర యాప్‌లను వాడుతున్న వారు తమ పూర్వ వాట్సాప్ చాట్ లను ఇంపోర్ట్ చేసుకోవడంలో కొంచం అసహనానికి గురిఅవుతున్నారు.

How To Import WhatsApp Chats To Telegram - Sakshi

అయితే తాజాగా టెలిగ్రామ్ కొత్తగా తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకోని వచ్చింది.ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్లను కూడా టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాట్ హిస్టరీతో పాటు వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఇతర మీడియా కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వాట్సాప్ నుంచే కాకుండా లైన్, కకావో టాక్ వంటి ఇతర యాప్‌ల చాటింగ్‌ను కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతమైన చాటింగ్‌తో పాటు గ్రూప్ చాటింగ్‌కు కూడా వర్తించనుంది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మీకు అక్కడ ఎక్స్‌పోర్ట్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు విత్ మీడియా, విత్ అవుట్ మీడియా అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. మీరు విత్ మీడియా ఎంచుకుంటే మీకు అదనంగా స్టోరేజ్ స్పేస్ ఖర్చవుతుంది. ఇలా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఈరోజు వరకు ఉన్న చాటింగ్ కూడా టెలిగ్రాంలోకి వచ్చేస్తుంది. వారు ఎప్పుడు పంపారో అదే టైం స్టాంప్‌తో మెసేజ్‌లు టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here