సొంతిల్లు కావాలా…? ఎస్‌బీఐ నుంచి మీకో గుడ్ న్యూస్!

0
179
Spread the love

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. గృహ రుణంపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కనీస వడ్డీ రేటు 6.70 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఖరారు అవుతాయి. అంతేకాకుండా.. ఫ్రాసెసింగ్ ఫీజు రద్దు కూడా కొనసాగుతుందని తెలిపింది. అయితే.. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘కస్టమర్ల సిబిల్ స్కోర్, తీసుకోబోతున్న రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తాం. సమాయానికి చెల్లింపులు చేసే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందాలనేదే మా లక్ష్యం’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఎస్బీఐ 75 లక్షల లోపు రుణాలను 6.7 కసీన వడ్డీ రేటుతో అందిస్తోంది. రూ. 75 లక్షలకు మించిన లోన్స్ కనీస వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. అయితే.. యోనో యాప్ ద్వారా గృహ రుణాలు పొందేవారికి మరో ఐదు బేసిస్ పాయింట్ల మేరు వడ్డీ రేటు తగ్గుతుందని కూడా పేర్కొంది. ‘మేము పారదర్శకత పాటిస్తాం కాబట్టి వినియోగదారులు మమల్ని పూర్తిస్థాయిలో విశ్వసిస్తారు. మార్కెట్లో ఇంత కంటే తక్కువ వడ్డీరేటు లేదు’ అని ఎస్‌బీఐ రిటైల్ బిజినెస్ మ్యానేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here