హెచ్‌సీఎల్‌ ఉద్యోగులకు బొనాంజా

0
179
Spread the love

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. ఉద్యోగులకు ప్రత్యేక వన్‌టైమ్‌ బోన్‌సను ప్రకటించింది. సంస్థ టర్నోవర్‌ 1,000 కోట్ల డాలర్ల (రూ.72,800 కోట్లు) మైలురాయిని చేరిన సందర్భంగా ఉద్యోగులకు రూ.700 కోట్ల ప్రత్యేక బోన్‌సను ఇస్తున్నట్లు వెల్లడించింది. ఏడాది లేదా అంతకు మించి సర్వీసు ఉన్న ప్రతి ఉద్యోగికి 10 రోజుల వేతనానికి సమానమైన మొత్తం ఈ ప్రత్యేక బోన్‌సగా లభిస్తుంది. ఈ మైలురాయిని చేరుకోవడంలో ఉద్యోగులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ అధికారి వీవీ అప్పారావు తెలిపారు. ఫిబ్రవరి నెల వేతనంతో కలిపి ఈ ప్రత్యేక బోనస్‌ చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 1.59 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. కాగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత కంపెనీ టర్నోవర్‌ రూ.72,800 కోట్ల మైలురాయిని అందుకోవటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here