300 నుంచి 24!

0
211
Spread the love

ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రక్రియ ఇక జోరందుకోనుం ది. దేశంలోని పీఎ్‌సయూల సంఖ్య ను ప్రస్తుతమున్న 300 నుంచి 24 కు తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నీతి ఆయోగ్‌ సిఫారసుల ఆధారంగా మోదీ సర్కారు తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2021-22లో భాగం గా ప్రభుత్వం డిజిన్వెస్టమెంట్‌ పాలసీని ఆవిష్కరించింది. ఇందు లో భాగంగానే వ్యూహాత్మక రంగాలకు చెందిన పీఎస్‌‌యూలను కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవడం, వ్యూహాత్మకం కాని మిగతా సంస్థలను ప్రైవేటీకరించడం లేదా మరో పీఎ‌స్‌యూలో విలీనం చేయడం లేదా మూసివేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మొత్తం నాలుగు రంగాల (1. అణు శక్తి, అంతరిక్షం, రక్షణ 2. రవాణా, టెలీకమ్యూనికేషన్స్‌ 3.విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు ఇతర ఖనిజాలు 4. బ్యాంకిం గ్‌, ఇన్సూరెన్స్‌, ఆర్థిక సేవలు)ను వ్యూహాత్మక రంగాల విభాగంలో చేర్చారు. వ్యూహాత్మకేతర రంగాల్లోనైతే అన్ని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయనున్నట్లు చెప్పారు. మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీల పాత్ర తగ్గించి ప్రైవేట్‌ రంగంలో కొత్త పెట్టుబడులకు అవకాశం కల్పించడమే డిజిన్వె్‌స్టమెంట్‌ పాలసీ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.

రూ.1.75 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎల్‌ఐసీ అనుబంధ విభాగంగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతేకాదు, పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా ఎల్‌ఐసీలో మైనారిటీ వాటా విక్రయంతోపాటు ఎయిర్‌ఇండియా,బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలను ప్రైవేటీకరించనున్నారు.

మిధానీ, బీహెచ్‌ఈఎల్‌లోనూ వాటా విక్రయం?

వ్యూహాత్మక వాటాల విక్రయం కోసం కేంద్రం ఇప్పటికే ఓ జాబితాను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ), బీఈఎంఎల్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎ్‌సఈ లిమిటెడ్‌)లో వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ నాలుగు సంస్థలు..ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీలు కావటం గమనార్హం. 2019లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన మిధానీ ఈక్విటీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 74 శాతం వాటా ఉంది. ఇందులో కొంత మొత్తాన్ని లేదా పూర్తి వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా బీఈఎంఎల్‌లో ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. మరోవైపు తదుపరి విడతలో భారత్‌ హెవీ ఎలక్ట్రిక్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌), మెకాన్‌ లిమిటెడ్‌, ఆండ్రూ యూల్‌ అండ్‌ కో లిమిటెడ్‌లోనూ వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. ఇందు కోసం ప్రభుత్వం ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ను సలహాదారుగా నియమించుకుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపం)కు ఎస్‌బీఐ ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here